Share News

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:59 PM

జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలను ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకవేయించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు
ఇమాంపురంలో చిన్నారికి చుక్కలమందు వేస్తున్న అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

  • అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

  • జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు

అలంపూర్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలను ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకవేయించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం అలంపూర్‌లోని ఇమాంపూర్‌ గ్రామంలో నిర్వ హించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. పిల్లలకు పోలియో చుక్కలువేశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయిస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ పిండి జయరాములు, వైస్‌చైర్మన్‌ విక్రం, కౌన్సిలర్లు, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 11:59 PM