రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:26 PM
వేర్వేరు రోడ్డు ప్ర మాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువు రు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
- ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్
అచ్చంపేట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు రోడ్డు ప్ర మాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువు రు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెంది మరొకరి తీవ్ర గాయాలైన సంఘటన ఆది వారం అచ్చంపేట మండల పరిధిలోని శ్రీశైలం-అచ్చంపేట ప్రధాన రహ దారి బొల్గెట్‌పల్లి స్టేజి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సద్దాహుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం... అచ్చంపేట పటణంలో నివాముంటున్న ఎం. మహేష్, అరెకంటి పల్లవి ఇరువురు రంగాపూర్ నుంచి ద్విచక్ర వాహనం పై అచ్చంపేటకు వస్తుండగా అచ్చంపేట నుంచి వస్తున్న బస్సును ఎదురెదురుగా ఢీకొనడంతో యువకుడు సంఘటన స్థలంలో మృతి చెందాడు. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో యువతిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు, బైకు ఢీ..
బ్రహ్మగిరి, ఫిబ్రవరి 15 (ఆంధ్ర జ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రా బాద్ మండలం బ్రహ్మగిరి సమీపం లో శ్రీశైలం ఘాట్ రోడ్డుపై కారు, బైకు ఎదురెదురుగా ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుం ది. బ్రహ్మగిరి పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం... శ్రీశైలం - హైదరా బాద్ ప్రధాన రహదారి ఆక్టోఫస్ వ్యూ పాయింట్ సమీపంలో శ్రీశైలం నుంచి ఆమనగల్లుకు వెళుతున్న కా రు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం బైకుపై వెళు తున్న జహీరాబాద్‌కు చెందిన యువకున్ని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. దీం తో మృతదేహాన్ని, గాయపడిన వారిని శ్రీశైలం వెళుతున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిరెడ్డి తన కారులో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.