Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:06 PM

రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్య క్తులు మృతి చెందిన ఘ టన నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో చో టుచేసుకున్నది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

- రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం

తెలకపల్లి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్య క్తులు మృతి చెందిన ఘ టన నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో చో టుచేసుకున్నది. ఈ ఘట నకు సంబంధించి ఏఎస్‌ఐ శంకర్‌ రెడ్డి తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. కామ్మారెడ్డిపల్లికి చెందిన ఆవుల శాంతయ్య, శాంతమ్మ దంపతులు కొంతకాలంగా తెలకపల్లి గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం రాత్రి వారి కుమారుడు అవుల భీముడు (17) పీర్ల సవారీలను చూసివస్తానని తన బైకుపై తెలకపల్లికి చెందిన తన స్నేహితుడైన తుపాకుల బాలుతో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. తెలకపల్లితో పాటు గౌరెడ్డిపల్లి గ్రామంలో పీర్ల సవారీలను చూసి తిరిగి తెలకపల్లికి బయలుదేరారు. గౌరెడ్డిపల్లి గ్రామంలోని పాత బస్టాండ్‌ వద్దకు రాగానే తెలకపల్లి వైపు నుంచి బైకుపై వస్తున్న కామ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వట్టేపు జగన్‌ కుమార్‌(24) ఎదు రుగా వచ్చాడు. దీంతో రెండు బైకులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భీ ముడు తలకు తీవ్ర రక్తపుగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వెను క కూర్చున్న బాలుకు ఎడమ చెయ్యి, ఎడమ కాలుకు తీవ్ర రక్తపు గాయా లయ్యాయి. జగన్‌ కుమార్‌ తల కుడి వైపు తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. జగన్‌కుమార్‌ హైదరాబాదులో ఆర్టీసీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భీముడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 25 , 2026 | 11:06 PM