Share News

వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి ఇద్దరు రైతుల బలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 10:50 PM

వేర్వేరు ప్రాంతాల్లో ఇ ద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.

 వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి ఇద్దరు రైతుల బలి

గద్వాల/వనపర్తి రూరల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : వేర్వేరు ప్రాంతాల్లో ఇ ద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కాకుళారం గ్రా మంలో బుధవారం విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. గ్రామానికి చెందిన రైతు పాండు రంగారావు(61)కు గ్రామ శివారులో 10 ఎ కరాల భూమి ఉన్నది. బోరుబావి కింద ఆ రుతడి పంటగా జొన్న సాగుచేశాడు. ఉద యం పొలం వద్దకు వెళ్లి నీరు పెడుతుండగా విద్యుత్‌ మోటార్‌ ఆఫ్‌ అయ్యింది. దీంతో మరో వ్యక్తితో కలిసి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పరిశీలించగా ఫీజులు పోయినట్లు గుర్తించారు. ఏబీ స్విచ్‌ను ఆఫ్‌చేసి ఫీజు లు వేశారు. మరికొంత సేపటి తర్వాత మళ్లీ మోటార్‌ ఆఫ్‌ అయ్యింది. ఈ సారి ఒక్కడే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వచ్చి పరిశీలించగా మళ్లీ ఫీజులు పోయినట్లు గుర్తిం చి ఏబీ స్విచ్‌ను ఆఫ్‌చేసి ఫీజులు వేశాడు. ఆ తర్వాత ఏబీ స్విచ్‌ను ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. మరోవ్యక్తి వెళ్లి చూడగా విద్యుదాఘాతానికి గురైనట్లు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఏఎస్సై రఘునాథ్‌, విద్యుత్‌ అధికారులు పరిశీలించి కే సు నమోదు చేశారు. అదేవిధంగా, వి ద్యుత్‌ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘ టన బుధవారం వనపర్తి పట్టణ కేంద్రం లో రాంనగర్‌కాలనీలో చోటు చేసుకున్నది. శ్రీనివాసులు(40) స్థానిక ర్యాంకర్స్‌ పాఠ శాల ముందు తనకున్న వ్యవసాయ పొ లంలో వరిసాగు చేశాడు. ప్రతీరోజు మా దిరిగానే వ్యవసాయ పొలానికి వెళ్లిన శ్రీని వాసులు పంటకు తెగులు రావడంతో మందు పిచికారి చేశాడు. అనంతరం పక్కనే ఉన్న మరో వ్యవసాయ పొలంలో బోరు దగ్గరికి వెళ్లి స్నానం చేశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కరెంటు వైర్‌కు తగిలాడు. ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. స్థా నికులు అతన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Updated Date - Sep 30 , 2026 | 10:50 PM