రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరి మృతి
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:49 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో శని వారం సాయంత్రం బొంకూరు శివా రులో జరిగిన ప్రమాదంలో చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మృ తి చెందినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపా రు.
- మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థి
ఉండవల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో శని వారం సాయంత్రం బొంకూరు శివా రులో జరిగిన ప్రమాదంలో చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మృ తి చెందినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపా రు. వడ్డేపల్లి మండలం, తుమ్మసి పల్లె గ్రామానికి చెందిన శంకరన్న, పద్మమ్మలకు ఇద్దరు సంతానం. భర్త సవారన్న గతంలోనే మృతి చెందాడు. మొదటి సంతానం అయినా లా వణ్య (18)ను జగిత్యాల జిల్లా కోరుట్లలో వెటర్నరీ మూడో ఏడాది చదు వుతుంది. ఈమెతో పాటు చదువుతున్న ఇదే మండలం, ముండ్లదిన్నె గ్రా మానికి చెందిన ఉషారాణితో పాటు దసరా సెలవులకు సొంతూళ్లకు వ స్తూ అలంపూర్చౌరస్తాలో ఆటో ఎక్కారు. ఇదే ఆటోలో శాంతినగర్ పట్ట ణానికి చెందిన జోగి దుర్గా (42)తో పాటు మరో ఇద్దరు ఎక్కారు. మార్గ మధ్యలో బొంకూరు వద్ద ఎదురుగా ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొన డంతో వీరితో పాటు డ్రైవర్ దస్తగిరి గాయపడగా, వీరందరిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆదివారం సా యంత్రం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందిం ది. ఈ ఘటనతో తుమ్మసిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి. ఈమె స్నేహితురాలు ఉషారాణి మృత్యువుతో పోరాడుతుంది. ఊ రూరా తిరుగుతూ.. తాళాలు రిపేర్లు చేసుకునే జోగి దుర్గా (42) కూడా ఆదివారమే మృతి చెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ యనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రోజులాగే పనులు ము గించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో కుటుం బం వీధిన పడింది. జోగి దుర్గా సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.