రెండు బైకులు ఢీ : యువకుడి మృతి
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:19 PM
అతి వేగంగా బైకులు నడిపి ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు.
వీపనగండ్ల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అతి వేగంగా బైకులు నడిపి ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపన గండ్ల మండలంలోని బొల్లారం గ్రామంలో బుధవా రం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం వెలగొండ శివశంకర్ అ లియాస్ శరత్ (19) కిరాణం సామగ్రి తెచ్చేందుకు బైక్‌పై కొర్లకుంట మీదుగా కొల్లాపూర్ వెళ్లేందుకు బ యలు దేరాడు. కొర్లకుంట వైపు నుంచి కావలి కృష్ణ ప్రసాద్ బైక్‌పై వ స్తున్నాడు. బొల్లారంలోని బిచ్చయ్య ఇంటి ఎదుట రెండు బైకులు ఽఢీకొ న్నాయి. ఈ ఘటనలో శివశంకర్ తలకు బలమైన గాయం కాగా కృష్ణ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శివశంకర్‌ను మహబూబ్‌నగర్ ఆసు పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కావలి కృష్ణ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలి పారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.