Share News

కుక్కను తప్పించబోయి..

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:28 PM

కుక్కను తప్పించబోయి స్కూటీ అదుపు తప్పి భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఘటన నాగ ర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని కల్వ కుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై గురువారం చో టు చేసుకుంది.

కుక్కను తప్పించబోయి..

- స్కూటీపై నుంచి పడి వృద్ధుడి మృతి

ఊర్కొండ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కుక్కను తప్పించబోయి స్కూటీ అదుపు తప్పి భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఘటన నాగ ర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని కల్వ కుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై గురువారం చో టు చేసుకుంది. వెల్దండ మండలం పోచమ్మ గడ్డ తండాకు చెందిన వడ్త్యావత్‌ ఈరమణ్‌ (65) వడ్త్యావత్‌ అంజమ్మ (55) దంపతులు మిడ్జిల్‌ మండలంలోని దోనూర్‌ తండాకు స్కూటీపై వెళ్లి ఇం టికి తిరుగు ప్రయాణం అయ్యారు. స్వగ్రామం చేరుకుంటున్న సమయం లో కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై సూర్యలత కాటన్‌ మిల్లు సమీపంలో కుక్కలు అడ్డురావడంతో స్కూటీ అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వడ్త్యావత్‌ ఈరమణ్‌ పరిస్థితి విష మించడంతో హైదరాబాద్‌ తరలించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అంది స్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వడ్త్యావత్‌ అం జమ్మను కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అంది స్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 11:28 PM