Share News

గోతితో గోస

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:46 PM

మండలంలోని కొత్తూరు గ్రామానికి వెళ్లే మార్గంలో డ్రై నేజీ మరమ్మతుకు రోడ్డుకు అడ్డంగా గోతిని త వ్వి రోజులు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

గోతితో గోస
రోడ్డుకు అడ్డంగా తీసిన గోతి

- రాకపోకలకు తప్పని తిప్పలు

- కొత్తూరుకు వెళ్లే దారిలో అసంపూర్తిగా డ్రైనేజీ పనులు

మిడ్జిల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తూరు గ్రామానికి వెళ్లే మార్గంలో డ్రై నేజీ మరమ్మతుకు రోడ్డుకు అడ్డంగా గోతిని త వ్వి రోజులు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. వెలుగొమ్ముల నుంచి కొత్తూరకు వెళ్లే దారిలో డ్రైనేజీ వ్యవస్థలో ధ్వంసమైన మ్యాన్‌ హోళ్లను సరిచేసేందుకు రోడ్డును తవ్వినప్పటికీ, పనులు పూర్తికాకపోవడంతో రాకపోకలకు అంత రాయం ఏర్పడుతోంది. రాత్రి వేళ గోతిని గుర్తిం చడం కష్టంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఈ మార్గం లో ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లే దని చెబుతున్నారు. ఈ విషయంపై కొత్తూరు సర్పంచు కావలి రాము లును వివరణ కోరగా, గ్రామంలో ధ్వంసమైన మ్యాన్‌ హోళ్లకు మరమ్మతులు చేపట్టామని తెలి పారు. మేస్ర్తీ అందుబాటులో లేకపోవడంతో పనులు పూర్తికాలేదని వివరించారు. త్వరలోనే కల్వర్టును ఏర్పాటు చేసి, రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Oct 22 , 2026 | 11:46 PM