గుప్తనిధుల తవ్వకాల ముఠా పట్టివేత
ABN , Publish Date - May 29 , 2026 | 11:18 PM
నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీ వల విస్తృతంగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టే ముఠాను పోలీసులు ప ట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
- అదుపులోకి ఐదుగురు, ఓ ఎక్స్‌కవేటర్ స్వాధీనం
అమ్రాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీ వల విస్తృతంగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టే ముఠాను పోలీసులు ప ట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రయ్య శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మం డలంలోని ఉడిమిళ్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో వినాయకుడి మా న్యం వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి రెండు కార్లలో వచ్చిన నిందితులు ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించి తవ్వకాలు చేపట్టారు. అక్కడ ఎలాంటి గు ప్తనిధులు లభించలేదు. తిరిగి మరోసారి ఉడిమిళ్ల ప్రాంతంలో తవ్వకాలు జరపాలని శుక్రవారం ఉదయం ఎక్స్‌కవేటర్‌తో పాటు అక్కడికి వెళ్తున్న ఐదుగురిని పదర ఎస్‌ఐ వినోద్‌కుమార్ సిబ్బందితో కలిసి మన్ననూర్ ఫా రెస్టు చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ తెలి పారు. మధు, నాగుల మల్లయ్య, ధర్మా అనే వ్యక్తికి రూ.1.50లక్షలు చెల్లిం చి ఎక్స్‌కవేటర్‌ను తవ్వకాల కోసం అద్దెకు తీసుకున్నట్లు సీఐ వివ రిం చారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీస్ బృం దాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అరెస్టు అయిన వా రిలో ఉప్పునుంతల మండలం కేంద్రానికి చెందిన మధునాగుల మల్లయ్య, కల్వకుర్తి మండలం సుద్దకల్‌కు చెందిన పుట్ట మల్లేష్, ఎక్స్‌కవేటర్ డ్రైవర్ అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామానికి చెందిన వర్త్యావత్ ధర్మ, పదర మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన మేగావత్ మోతిలాల్, కాసా నాగరాజులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు.