ప్రయాణం కూడా పరీక్షే !
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:35 PM
ఇంటర్ పరీక్ష రాసేందుకు పలుగ్రామాల విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. నిత్యం ఇబ్బందిపడుతూ ప్రైవేటు వాహనంలో పరీక్షకు హాజరవుతున్నారు.
మానవపాడు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ పరీక్ష రాసేందుకు పలుగ్రామాల విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. నిత్యం ఇబ్బందిపడుతూ ప్రైవేటు వాహనంలో పరీక్షకు హాజరవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి స్థానిక విద్యార్థులతో పాటు ఇటిక్యాల మండలంలోని ప్రభుత్వ కళాశాల, మానవపాడు కేజీబీవీ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. వీరు వచ్చి, వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్ పరీక్షతో పాటు నిత్యం రాకపోకలు కూడా వారికి మరో పరీక్షగా మారింది. గురువారం ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు 157 మంది విద్యార్థులకు గానూ 155 మంది హాజరయ్యారని పరీక్ష కేంద్రం ఇన్‌చార్జి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.