ఫిబ్రవరి 2 నుంచి గ్రూప్-1 అధికారులకు శిక్షణ
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:20 PM
ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు గ్రూప్-1 అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించేందు కు ఏర్పాట్లు చేశారు. అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంట ర్‌లో శిక్షణ తరగతులకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ బదావత్ సం తోష్ గురువారం పరిశీలించారు.
అచ్చంపేట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు గ్రూప్-1 అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించేందు కు ఏర్పాట్లు చేశారు. అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంట ర్‌లో శిక్షణ తరగతులకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ బదావత్ సం తోష్ గురువారం పరిశీలించారు. ఒక విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది గ్రూప్-1 అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న నేప థ్యంలో వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు, శిక్షణ తరగతు ల నిర్వహణకు తరగతి గదులు, సమావేశ మందిరాలు తదితర ఏ ర్పాట్లను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. శిక్షణకు హాజరయ్యే అధికారులకు ఎలాంటి అ సౌకర్యా లు కలుగకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చ ర్యలు తీసుకోవాలని, శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేం దుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచిం చారు. జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్‌చంద్ర, జిల్లా గిరిజన సంక్షే మ శాఖ అధికారి ఫిరంగి, ఆర్డీవో యాదగిరి తదితరులు ఉన్నారు.