విద్యార్థి మృతితో వనపర్తిలో విషాదం
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:50 PM
ఉన్నత చదువులు చదివి ప్ర యోజకులవుతారనుకున్న కవల పిల్లల్లో ఒకరు అర్ధాంతరంగా తనువు చా లించగా, మరో కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
వనపర్తి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు చదివి ప్ర యోజకులవుతారనుకున్న కవల పిల్లల్లో ఒకరు అర్ధాంతరంగా తనువు చా లించగా, మరో కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హైద రాబాద్లోని ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని శంకర్గంజికి చెందిన బీటెక్ వి ద్యార్థిని నారాయణదాసు సోనా(18) మృతి చెందడంతో ఆ కుటుంబలో తీరని విషాదం నెలకొంది. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె సోదరి మీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హైదరాబాద్లోని నాద ర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్ర, శనివారాల్లో సంగ మం-2026 పేరుతో జాతీయ స్థాయి సంస్కృతి ఉత్సవాలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన దాండియా వేడుకల కోసం కళాశాల యాజమా న్యం భారీ విద్యుత్ లైటింగ్, సెట్టింగులు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులకు లైటింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే ఉన్న సోనా, మీనా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనా మృతి చెందింది. మీ నాకు చికిత్స అందిస్తున్నారు. తండ్రి అశోక్ స్వర్ణకారుడిగా పని చేస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. ఒక వైపు కూతురు మరణ వార్తతో పుట్టెడు దుఃఖంలో ఉండగా... మరోవైపు చికిత్స పొందుతున్న మీనా ఆరోగ్య పరి స్థితిపై ఆందోళన చెందుతున్నారు.