Share News

ట్రాఫికర్‌

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:36 PM

బాలానగర్‌ వైపు నుంచి షాద్‌ నగర్‌ వైపు వెళ్లాలన్నా... షాద్‌నగర్‌ వైపు నుంచి బాలానగర్‌ వైపు వెళ్లాల న్నా ట్రాఫిక్‌ తిప్పలు మాత్రం తప్ప డం లేదు.

 ట్రాఫికర్‌
షాద్‌నగర్‌ నుంచి బాలానగర్‌ వైపు వందల మీటర్ల మేర నిలిచిన వాహనాలు

- రాయికల్‌ టోల్‌గేట్‌ వద్ద తిప్పలు

బాలానగర్‌, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): బాలానగర్‌ వైపు నుంచి షాద్‌ నగర్‌ వైపు వెళ్లాలన్నా... షాద్‌నగర్‌ వైపు నుంచి బాలానగర్‌ వైపు వెళ్లాల న్నా ట్రాఫిక్‌ తిప్పలు మాత్రం తప్ప డం లేదు. గతంలో ఉన్న టోల్‌గేట్‌ ని ర్వహణ బాధ్యతలు గడువు తీరింది. అయితే, ప్రస్తుత నిర్వహణ బాధ్యత లు జాతీయ రహదారి సంస్థ నిర్వహి స్తున్నది. దీంతో ప్రస్తుతం రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుం చి టోల్‌ రుసుము పెంచడంతో పాటు, వాహనదారుల నెలవారి పాసులు రెం డు రెట్లు పెంచడం, పలు వాహనాల పాసులను రద్దు చేయడం వంటి చర్య లు చేపట్టిన అధికారులు నిర్వహణను గాలికి వదిలేసినట్లు వాహనదారులు వాపోతున్నారు. గతంలో టోల్‌గేట్‌ వద్ద పెద్దగా లేని ట్రాఫిక్‌ సమస్య ఈ మ ధ్యకాలంలో ఉత్పన్నం అవుతోందని అంటున్నారు. నిత్యం వాహనాల ట్రాఫి క్‌ వందల మీటర్ల మేర ఉంటుం దని, పలుమార్లు ట్రాఫిక్‌ జాం అవుతుందని వాపోతున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:36 PM