ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:39 PM
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల, బా లానగర్లలో బుధవారం ఉదయం, సా యంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిం ది.
- జడ్చర్ల, బాలానగర్‌లలో వాహనదారుల ఇక్కట్లు
జడ్చర్ల/ బాలానగర్, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల, బా లానగర్లలో బుధవారం ఉదయం, సా యంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిం ది. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ల నుంచి హైద రాబాద్ వైపు వెళ్లే బస్సులు, కార్లు, పోలేప ల్లి సెజ్‌లోని పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగుల వాహనాలు ఒకేసారి జడ్చర్ల క్రాస్‌రోడ్డు వ ద్దకు చేరుకున్నాయి. అదే సమయంలో ఓ ప్రైవేటు బస్సు రాంగ్రూట్లో వచ్చింది. దీంతో అరగంట పాటు ఎక్కడివక్కడే నిలి చిపోయాయి. బాలానగర్ మండల కేం ద్రంలో కొనసా గుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులతో సబ్రో డ్డు అస్తవ్యస్తంగా మారింది. దీంతో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలు సాయంత్రం దాదాపు 50 నిమిషా ల పాటు నిలిచిపోయాయి. దీంతో వాహనదా రులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.