Share News

ట్రాక్టర్‌ బోల్తా... ఒకరి మృతి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:20 PM

ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

ట్రాక్టర్‌ బోల్తా... ఒకరి మృతి

మక్తల్‌రూరల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం భగవాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బండమీద వెంకటేష్‌ (57) భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీ వనం సాగిస్తున్నాడు. శనివారం భగవాన్‌పల్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప తో పాటు ఊరికి వెళ్లడానికి మక్తల్‌ నుంచి సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రా క్టర్‌లో ఎక్కి బయలు దేరారు. పంచలింగాల, చిన్న గోప్లాపూర్‌ మధ్య డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ట్రాక్టర్‌ పల్టీ పడగా సిమెంటు బస్తాలు వెంకటే ష్‌ మీద పడి తీవ్ర గాయాలు కాగా, తిమ్మప్పకు స్వల్ప గాయాలయ్యాయి. మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందు తూ మృతి చెందగా తిమ్మప్ప రాయచూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నాడు. మృతుడి భార్య బండమీది మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.

Updated Date - Apr 25 , 2026 | 11:20 PM