కాలువలో పడిన ట్రాక్టర్ .. డ్రైవర్ మృతి
ABN , Publish Date - May 10 , 2026 | 11:36 PM
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని నాంచారమ్మపేట తండా సమీపంలోని బీమా కాలువలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసు కుంది.
కొత్తకోట, మే 10 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని నాంచారమ్మపేట తండా సమీపంలోని బీమా కాలువలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసు కుంది. పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ సాయితేజ (19) కొత్తకోట మండల నాంచారమ్మపేట తండాకు వరి గడ్డి చుట్టడానికి వెళ్తుండగా అదుపు తప్పి కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. గమనించిన రైతులు డ్రైవర్‌ను బయటకు తీశారు. గాయాల తో ఉన్న చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. చికిత్స పోందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్ తెలిపారు.