Share News

విద్య, వైద్యానికి పెద్దపీట

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:46 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

విద్య, వైద్యానికి పెద్దపీట
అన్నాసాగర్‌లో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

భూత్పూర్‌/చిన్నచింతకుంట మూసాపేట నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని అన్నాసాగర్‌, తాటిపర్తి, వెల్కిచర్ల గ్రామాల్లో ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు రావులపల్లి, పాతమొల్గర గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. హస్నాపూర్‌, భట్టుపల్లి, వెల్కిచర్ల గ్రామాల్లో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే గ్రామాలు, పట్టణాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్ధిందన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, యుజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపతిరెడ్డి, సర్పంచులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీశైలం, సంజీవరెడ్డి, హబీబునిసబేగం, నరేందర్‌, లక్ష్మమ్మ, రమేష్‌, నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. చిన్నచింతకుంట మండలం దమాగ్నపూర్‌లో ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, వడ్డెమాన్‌లో మహిళా సంఘం భవనం, ఏదులాపూర్‌లో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అడ్డాకుల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, మూసాపేట మండలం సంకలమద్దిలో మహిళా సంఘం భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రం, నందిపేటలో వాటర్‌ ప్లాంట్‌, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు చంద్రశేఖర్‌, శ్రీహరి, సర్పంచులు దశరథరెడ్డి, ప్రవీన్‌కుమార్‌రెడ్డి, మాధవి, సింగిల్‌ విండో అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డి, ఎంపీడీవోలు కృష్ణయ్య, సద్గుణ ఉన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 11:46 PM