రెండు గంటలకోసారి టాయిలెట్స్ శుభ్రం చేయాలి
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:40 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ప్రతీరోజు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
గద్వాల న్యూటౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ప్రతీరోజు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్యసేవ లు, మందులు, ల్యాబ్ రిపోర్టులు, సర్జరీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యసిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది వందశాతం హాజరు ఉండాలన్నారు. ప్రతీరోజు హాజ రు వివరాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్‌లో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆ సుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు కూడా హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలన్నారు. కొన్నివార్డుల్లో ఫ్యాన్లు పనిచేయడంలేదని గమనించారు. అన్ని ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని, ఆసుపత్రిలో ఎక్కడా పేషెంట్లు నిలబడకుండా, వారికి సౌకర్యంగా, వేగంగా వైద్యసేవలు అందేలా టోకెన్ సి స్టమ్ అమలు చేయాలన్నారు. ఆసుపత్రి టాయిలెట్స్ ప్రతీ రెండు గంటలకు ఒకసారి శుభ్రంచేసి చార్ట్‌లో రాయాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా, పిచ్చిమొక్కలు లేకుండా ఉంచాలని, శానిటేషన్ అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో రోగులకు తాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలో భోజనం అందిస్తున్న సిబ్బందితో మాట్లాడి పౌష్టికాహారం అందించాలన్నారు. ల్యాబ్, రేడియాలజీ, డయోగ్నోస్టిక్ సెంటర్స్ పరిశీలించి, ల్యాబ్ రిపోర్టులు, ఎమర్జెన్సీ పరీక్షలు త్వరగా చేసి రోగులకు అందజేయాలన్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్‌ఎంవో హేమలత, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.