Share News

నేడు మెట్టినింటికి జములమ్మ

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:12 PM

గద్వాల పట్టణ సమీపంలోని జములమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని తీసుకు వచ్చేందుకు ఆమె పుట్టినిల్లు ఆయిన గుర్రంగడ్డకు మంగళవారం చీరా సారెతో ఎద్దుల బండి వెళ్లింది.

నేడు మెట్టినింటికి జములమ్మ
అమ్మవారిని తీసుకురావడానికి సారెతో బయలుదేరిన ఆలయ ఈఓ

- సారెతో ఎద్దుల బండిపై గుర్రంగడ్డకు బయలుదేరిన నిర్వాహకులు

గద్వాల, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): గద్వాల పట్టణ సమీపంలోని జములమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని తీసుకు వచ్చేందుకు ఆమె పుట్టినిల్లు ఆయిన గుర్రంగడ్డకు మంగళవారం చీరా సారెతో ఎద్దుల బండి వెళ్లింది. అంతకుముందు ఆలయ ఈవో పురేందర్‌కుమార్‌, మాజీ చైర్మన్‌ వెంకట్రాములు, సతీష్‌కుమార్‌లు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయం ప్రకారం దేవాలయం తరపున సారెను సిద్ధం చేసి అమ్మవారిని తీసుకవచ్చే నిర్వాహకుల భుజాన ఎత్తి భాజా భజంత్రీలతో ఎద్దుల బండి వరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి జమ్మిచేడు, లత్తీపురం, బీరోలు మీదుగా గుర్రంగడ్డకు సాయంత్రం చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం బుధవారం తెల్లవారుజామున జమ్మిచేడుకు తీసుకురానున్నారు.

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం భక్తులు పెద్ద ఎ త్తున తరలివచ్చారు. తెల్లవారుజామున 5గంటల నుంచి ఆలయానికి భక్తుల తా కిడి పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తు లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయంత్రం వరకు 60వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో పురేందర్‌ కుమార్‌లు తెలిపారు.

Updated Date - Jan 27 , 2026 | 11:12 PM