Share News

సాగు నీటి కోసం కర్ణాటకకు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:53 PM

ఎల్‌నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు ఇప్పుడు జిల్లా రైతులను నష్టపరుస్తుండగా.. అధికార, ప్రతిపక్షాల రాజకీయాలను కుదిపేస్తోంది.

సాగు నీటి కోసం కర్ణాటకకు..
కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తున్న పాలమూరు ప్రజాప్రతినిధులు

- సీఎం డీకే శివకుమార్‌ను కలువనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

- నెల రోజులు 5వేల క్యూసెక్కుల చొప్పున విడుదల కోసం వినతి

- చర్చలు ఫలిస్తే జూరాల కింద రైతులకు సాగు ఇక్కట్లు తీరినట్లే..

- అన్ని లిఫ్టులు నడిపినా 5 వేల క్యూసెక్కులు సరిపోయే అవకాశం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఎల్‌నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు ఇప్పుడు జిల్లా రైతులను నష్టపరుస్తుండగా.. అధికార, ప్రతిపక్షాల రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటుండగా.. పచ్చగా ఉండాల్సిన పంట చేలు ఎండుముఖం పడుతున్నాయి. ఉన్న నీటిని విడుదల చేసినా, తాగునీటికి ఇబ్బందులు ఉండవని బీఆర్‌ఎస్‌ ధర్నాలు చేపట్టగా.. ప్రభుత్వం అందరినీ హౌస్‌ అరెస్టు చేసి అడ్డుకుంది. అయినా మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిలాంటి వారు రైతుల నిరస నల్లో పాల్గొని.. గేట్లు తెరవకపోతే తామే తెరుస్తామని ప్రకటించారు. ఈ లడాయిలో వెనుకబడిన బీజేపీ.. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో ధర్నాకు పిలుపునివ్వగా.. ఆయనను మంగళవారం జడ్చర్ల వద్ద అరెస్టు చేసి అడ్డుకున్నారు. అయితే ఎల్‌నినో విషయంపై రాజకీయం చేయడం తప్పా.. అధికార, ప్రతిపక్షాల నుంచి కచ్చితమైన ప్రణాళికలు వెలువడటం లేదు. ఈ రాజకీయ గందరగోళంలో తమకు ఇబ్బందులు వస్తాయనుకున్న అధికారపక్షం వెంటనే అప్రమత్తమైంది. నీటి విడుదలకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే.. కర్ణాటకతో మాట్లాడా లని నిర్ణయించింది. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం కర్ణాటక ముఖ్య మంత్రి డీకే శివకుమార్‌కు లేఖ రాయగా.. తాజాగా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఆయకట్టు పరిధిలోని ఎ మ్మెల్యేలు కూడా మరో లేఖ రాశారు. దాంతో పాటు సీఎం శివకుమార్‌ను కలిసేందుకు బెంగుళూరుకు బ యలుదేరివెళ్లారు. ఈ బృందంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూధన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు.

చర్చలు ఫలిస్తే ఇక్కట్లు దూరం

ప్రస్తుతం జూరాలకు 2,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆ నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. 9 టీఎంసీల వరకు నీరు ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీకి దాదాపు 3.5టీఎంసీల వరకు పోతుందనే అంచనా ఉంది. మిగిలిన నీటిలో 2.5 టీఎంసీల వరకు తాగునీటికి ఉంచినా.. మిగతా 3 టీఎంసీల నీటిని సాగుకోసం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ వాదిస్తున్నాయి. అయితే అందులో వాస్తవం ఉన్నప్పటికీ, పంట చివరి వరకు నీరిచ్చే అవకాశం లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ గందరగోళం తమకు ఇబ్బందులు తెస్తుందని భావించిన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఆయకట్టు ఎమ్మెల్యేలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ నెల 20వ తేదీనే కర్ణాటక సీఎంకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజులపాటు విడుదల చేయాలని కోరారు. సీఎంను కలిసిన తర్వాత ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి దాన్ని రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున నెలరోజులు నిరంతరాయంగా ఇవ్వాలని లేఖ రాశారు. ఈ మేరకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసేందుకు బెంగుళూరు వెళ్లారు. చర్చలు ఫలిస్తే జూరాలతో పాటు ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు.

రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు వస్తే..

ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసమే సాగు కు నీరు విడుదల చేయడం లేదని అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు వస్తే ఇటు తాగునీటి బ్యాలెన్స్‌ ఉంచడంతో పాటు సాగుకు పుష్కలంగా నీరు ఇచ్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూరాల ఆధారంగా ఎడ మ, కుడి కాలువలు ఉండగా.. గరిష్ఠంగా వీటికి 2 వేల క్యూసెక్కుల వరకు విడుదల చేయవచ్చు. మిగిలిన 3 వేల క్యూసెక్కుల్లో భీమా-1కు 600 క్యూసెక్కులు, బీమా-2కు 600 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ కు 200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసుకోవ చ్చు. ఇప్పుడున్న నీటి నిల్వను ఇలా కాపాడుకోవ చ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇ ప్పటికే నదిలో చాలాచోట్ల గుంతలు తేలిపోయా యి. అటు నుంచి విడుదల చేసిన నీరు అంతే మొత్తం కిందకు రావడం చాలా కష్టమవుతుంది. కానీ నిరంతరాయంగా విడుదల చేస్తేనే కర్ణాటక ఇచ్చి న నీటివల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే జూ రాలపై ఆధారపడి గద్వాల, నారాయణపేట జిల్లా ల్లోని మెజారిటీ ప్రాంతాలు, వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరా లు తీరుతున్నాయి. వాటికీ ఈ నీటి విడుదల వల్ల ఇబ్బందులు తీరవచ్చు.

Updated Date - Sep 22 , 2026 | 11:53 PM