Share News

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:56 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అ న్నారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రియాంక

- అధికారులకు కలెక్టర్‌ ప్రియాంక ఆదేశం

- ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష

నారాయణపేట/ కోస్గి/ కోస్గి రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అ న్నారు. సమన్వయంతో వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కోస్గి, కొడంగల్‌ పట్టణాల్లో ఈ నెల 7, 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, రైతుల వివరాలను ముందుగానే సేకరించి సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సూ చించారు. ఇందుకోసం ఎంపీడీవోలు వెంటనే టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌ గౌడ్‌, ఏవో అనిల్‌కుమార్‌, ఆర్డీవో రమేశ్‌, సీ సెక్షన్‌ అధికారి జయసుధ, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ విజయ్‌ భాస్కర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నవీన్‌ కుమార్‌, జిల్లా వైద్య, ఆ రోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌, వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్‌, డీపీఆర్‌వో రషీద్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం సైదులు, కోస్గి మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు, మద్దూరు, గుండుమాల్‌ తహసీల్దార్లు మహేశ్‌, భాస్కరస్వామి పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన కోస్గి పట్టణంలోని సైన్స్‌ మ్యూజియంను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం కాన్వాయ్‌ రాకపోకలు సాగించే మార్గాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్‌, సీఐ సైదులు, ఆర్‌ఐ విజయ్‌ భాస్కర్‌, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, భాగ్యలక్ష్మీరెడ్డి, విజయ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:57 PM