కంకర వేశారు బీటీ మరిచారు
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:29 PM
ప్రభుత్వం పల్లెలకు సైతం రవాణా సులభతరం కావడానికి రహదారులను మంజూరు చేస్తోంది.
మహబూబ్‌నగర్ రూరల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పల్లెలకు సైతం రవాణా సులభతరం కావడానికి రహదారులను మంజూరు చేస్తోంది. కానీ అధికారుల నిర్లక్షం కారణంగా క్షేత్ర స్థాయిలో అమలుకావడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లాల్యానాయక్‌తండా, ఫత్తేపూర్ నుంచి భవానీ తండాకు వెళ్లే రోడ్లు నాలుగు నెలల క్రితం కంకర పరిచి, బీటీ వేయడం మరిచారు. దీంతో తం డావాసులు జిల్లా కేంద్రానికి రావాలంటే సుమారు రెండు కిలో మీటర్ల మేర కంకర రోడ్డు, అర కిలో మీటర్ గుంతల రోడ్డులో ప్రయాణించాలం టే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే లాల్యానాయక్‌తండా. భవాని తండాకు బీటీ వేయాలని కోరుతున్నారు.
వెంటనే బీటీ వేయాలి..
కాంట్రాక్టర్ నాలుగు నెలల క్రితం రెండు కిలో మీటర్ల దూరం కంకర వేసి వదిలేశాడు. అడిగితే బీటీ వేయడానికి ధరలు పెరిగాయని సమా ధానం చెబుతున్నాడు. వెంటనే ప్రధాన రోడ్డు నుంచి లా ల్యానాయక్ తండా వరకు బీటీరోడ్డు వేయాలి.
- ప్రతాప్ నాయక్, సర్పంచు
రోడ్డు వేయండి సారు..
కంకర వేసి వదిలేయడంతో ప్రమాదాలు జరు గుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయాలి.
- పూల్యానాయక్, లాల్యనాయక్ తండా