పత్తి విత్తనాల పేటెంట్‌ను కాపీ కొట్టారు..
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:09 PM
గ ద్వాల జిల్లా పత్తివిత్తనోత్పత్తికి పెట్టింది పే రు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఒక కంపెనీ కి చెందిన విత్తనాల కోడ్లను మరో కంపెనీ కాపీకొట్టి పత్తి విత్తనాలను పండిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి.
- ఫిర్యాదుపై రైతులతో విచారణ చేసిన పోలీసులు
గద్వాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) గ ద్వాల జిల్లా పత్తివిత్తనోత్పత్తికి పెట్టింది పే రు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఒక కంపెనీ కి చెందిన విత్తనాల కోడ్లను మరో కంపెనీ కాపీకొట్టి పత్తి విత్తనాలను పండిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో భాగంగానే గత 20రోజుల క్రితం గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో రాశీ కంపెనీకి చెందిన ప్ర తినిధులు తమ విత్తనాల పెటేంట్ను కాపీ కొట్టారని ఫిర్యాదు చేశారు. తమ మగ విత్తనాలతో మరో కంపెనీ క్రాసింగ్ చేసి కోడ్ల ను కాపీ కొట్టిందనేది వీరి సారాంశంగా తెలు స్తుంది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు దీనిని రహస్యంగా ఉంచారు. గురువా రం దీనికి సంబంధించి విచారణకు సీఐ శ్రీ ను గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఫీల్డ్‌పై విచారణ చేయడంతో ఇది వెలుగులో కి వచ్చింది. పత్తి విత్తనోత్పత్తి ద్వారా పండించిన రైతులను పోలీసులు విచారించారు. రా శీ కంపెనీకి చెందిన విత్తనాలు(మగ) ఎలా వచ్చాయని వివరాలు సేకరించారు. విత్తనాల శ్యాంపుల్స్ను సేకరించి వాస్తవంగానే మగ విత్తనాలతో క్రాసింగ్ చేశారా.. లేదా అని తెలుసుకోవడానికి ల్యాబ్‌కు విత్తనాలను పంపించినట్లు తెలుస్తుంది. విచారణ కొనసాగుతున్నది. శుక్రవారం కంపెనీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.