పార్టీ మారాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:30 PM
మ హబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవం కోసం సహకరించామని, ఆ కృతజ్ఞత కూడా లే కుండా తమ పార్టీ కార్పొరేటర్లను బ్లాక్‌మెయిల్ చే యడం దారుణమని మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. ఇలాంటి రాజకీయాలకు భయపడబోమని చెప్పారు.
మాజీ మంత్రి వి శ్రీనివా్‌సగౌడ్
మహబబూబ్‌నగర్, ఏ ప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): మ హబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవం కోసం సహకరించామని, ఆ కృతజ్ఞత కూడా లే కుండా తమ పార్టీ కార్పొరేటర్లను బ్లాక్‌మెయిల్ చే యడం దారుణమని మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. ఇలాంటి రాజకీయాలకు భయపడబోమని చెప్పారు. సోమవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేయర్ ఎన్నికలో ప్ర జాతీర్పును అనుకరించి హుందాగా వ్యవహరించామని, కాంగ్రెస్ మాత్రం తమ నైజాన్ని చాటుకుందని విమర్శించారు. కాంగ్రె్‌సలో చేరితేనే మీకు నిధులు ఇస్తామని, నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేయడం ఎమ్మెల్యే స్థాయికి తగదన్నారు. ముందు మీ పార్టీలో ఉన్నవాళ్లకు, పార్టీ జెండామోసి మీ విజయం కోసం పనిచేసిన వాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లకు పదవులు ఇవ్వాలని అన్నారు. లేదంటే ఎన్నికలు అవగానే తమ పార్టీకి చెందిన 25 మంది కౌన్సిలర్లను లాక్కుని వారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలామందికి టికెట్లు ఇవ్వలేదని, వారికన్నా పదవులు ఇవ్వాలని సూచించారు. మీ పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులకు అర్హులు లేరా అని ప్రశ్నించారు. కొందరు పోలీసులు కూడా తమ కార్పొరేటర్ భర్తను పార్టీ మారాలని ఒత్తిడి తేవడం దారుణమన్నారు. చేరికలపై కాకుండా తమ హయాంలో చే పట్టి, మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ హోటల్‌ను వదిలేశారని దుయ్యబట్టారు. తాను 99 ఏళ్లు లీజు తీసుకున్నానని చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. నాయకులు కేసీ నర్సింహులు పాల్గొన్నారు.