ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:39 PM
ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ప్రజల నుంచి 103 ఫిర్యాదుల స్వీకరణ
గద్వాల న్యూటౌన్ , ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 103 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మండలస్థాయిలోనే సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిష్కరిస్తే ప్రజలు చిన్న సమస్యలకే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఆ యాశాఖ ల అధికారులు క్రమం తప్పకుండా తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకొని తమశాఖల పరిధిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, అధికారులు ఉన్నారు.