అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించొద్దు
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:55 PM
జిల్లాలో కొనసాగుతున్న అభి వృద్ధి పనుల్లో నాణ్యతలోపించొద్దని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
ఉప్పునుంతల/వంగూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొనసాగుతున్న అభి వృద్ధి పనుల్లో నాణ్యతలోపించొద్దని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు. గురువారం ఆయన అచ్చంపేట సబ్‌కలెక్టర్ సలోనిచాబ్రా తో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల, కల్వకుర్తి మండలాల్లో కొనసాగుతున్న అభి వృద్ధి పనులను పరిశీలించారు. ఉప్పునుంత ల మండలం రాయిచేడ్ గ్రామంలో ఇంటి గ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనుల పురోగ తి, వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి లో పీహెచ్‌సీ భవన నిర్మాణం, పోల్కంపల్లి లో టీపీఎస్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించా రు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి గా పాటించాలని, గడువులోగా పూర్తి చేయించాలని అధి కారులను ఆదేశించారు. పీహెచ్‌సీ భవనాన్ని అక్టోబరు 5వ తేదీలోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ఆయ న తెలిపారు. అనంతరం వంగూరులో ప్రీ ప్రైమరీ తరగ తులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రీ ప్రైమరీ దశ ఎంతో కీలకమని, ఈ దశలోనే విద్యార్థుల్లో చదువు పట్ల అసక్తి, ఆలోచన శక్తి, సామాజిక నైపుణ్యాలు పెంపొందేలా భోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్, ఉప్పునుం తల తహసీల్దార్ సునీత, కొండారెడ్డిపల్లి గ్రామా భివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, ఉపసర్పంచ్ వేమారెడ్డి, ఆయా శాఖల డివిజ న్, మండల స్థాయి అధికారులు, ఉన్నారు.