Share News

విద్యాశాఖ పరిస్థితిలో మార్పు రావాలి

ABN , Publish Date - May 27 , 2026 | 11:36 PM

పాలమూరు విద్యాశాఖ పరిస్థితిలో మార్పు రావాలని జిల్లా విద్యాశా ఖాధికారి మధుసూదన్‌నాయక్‌ అన్నారు.

విద్యాశాఖ పరిస్థితిలో మార్పు రావాలి
ఇన్‌చార్జి డీఈవోకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఏడీ అనురాధ, సిబ్బంది

- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

- ఇన్‌చార్జి డీఈవో, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 27 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు విద్యాశాఖ పరిస్థితిలో మార్పు రావాలని జిల్లా విద్యాశా ఖాధికారి మధుసూదన్‌నాయక్‌ అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా అందరూ సమ యపాలన పాటించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ ఇన్‌చార్జి అధికారిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏడీ, సూపరింటెండెంట్‌, సెక్టోరియల్‌ అధికారులు, మండల విద్యాశాఖ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యాలయానికి వచ్చామా, పోయామా అన్నట్లు కాకుండా బాధ్యతలు స క్రమంగా నిర్వర్తించాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నందున అ న్ని పాఠశాలల్లో ఆవరణ, వంట పాత్రలను శుభ్రం చేయించాలని సూచించారు. ఒక అను మతితో రెండు, మూడు బ్రాంచులు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఎప్పటి ఫైల్స్‌ అప్పుడు పూర్తిచే య్యాలని, పెండింగ్‌ ఉంచకూడదని సూచిం చారు. అందరు సమన్వయంతో పని చేసి విద్యా శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. ప్రైవేట్‌ స్కూళ్లకు అనుమతుల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ అనురాధ, సూపరింటెండెంట్‌ మురళి, సెక్టోరియల్స్‌ అధికారులు దుంకుడుశ్రీనివాస్‌, ఆస్రాఖాద్రి, సుధాకర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 11:36 PM