బాలల హక్కులపై అవగాహన అవసరం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:19 PM
ప్రతీ విద్యార్థికి బాలల హక్కులపై అవగాహన అవసరమని జోగుళాంబ గద్వాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి సునంద అన్నారు.
డీడబ్ల్యూవో సునంద
ధరూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థికి బాలల హక్కులపై అవగాహన అవసరమని జోగుళాంబ గద్వాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి సునంద అన్నారు. మార్లబీడులో బుధవారం మహాత్మాజ్యోతిరావు ఫూలే పాఠశాలలో శి శుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా న్యాయసేవా సంస్థ సహకారంతో విద్యార్థులకు బాలల హ క్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సునంద మాట్లాడు తూ బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, లైంగిక వేధింపుల వంటి సమస్యల నుంచి పిల్లల ను రక్షించేందుకు అమలులో ఉన్న పోక్సో చ ట్టం గురించి వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా సంబంధిత అ ధికారులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రతీ విద్యార్థి తమ హక్కులను తెలుసుకుని తనతో పాటు ఇతర పిల్లల హక్కులను కూడా గౌరవిం చాలన్నారు. అనంతరం డీఎన్‌ఏస్ ప్రతినిధులు బాలల చట్టాలపై న్యాయపరమైన అంశాలను వివరించి, విద్యార్థుల సందేహాలకు సమాధానా లు ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీవో నరసింహ, డీఎల్‌ఏస్‌ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్, ఐసీపీఎస్ కౌన్సిలర్ సురేష్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, జయన్న, ఎంసీఎఫ్ హనిమిరెడ్డి ఉన్నారు.