అదిగో పులులు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:19 PM
నల్లమల అభయారణ్యంలో శనివారం సఫారీ యా త్రికులకు రెండు పెద్ద పులులు కనిపించాయి.
- సఫారీ యాత్రికులకు కనువిందు
మన్ననూర్, మార్చి1(ఆంధ్రజ్యోతి):నల్లమల అభయారణ్యంలో శనివారం సఫారీ యా త్రికులకు రెండు పెద్ద పులులు కనిపించాయి. పర్యాటకులు ఫర్హాబాద్ చౌరస్తా నుంచి వ్యూపాయింట్ సందర్శనకు వాహనంలో వెళ్తున్న క్రమంలో సోలార్ బోర్‌వెల్ సమీపంలో రెండు పెద్దపులులు, గుండం దారి వద్ద మరో పెద్దపులి కనిపించడంతో డ్రైవర్ వాహనా న్ని నిలిపారు. దీంతో పర్యాటకులు తమ సెల్‌ఫోన్‌లలో పెద్దపులులను చిత్రీకరించుకు న్నారు. ఈ వీడియోలను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఈ మూడు పులుల్లో రెండు మగ, ఒకఆడ పులిగా గుర్తించినట్లు డీఆర్‌వో శ్రీకాంత్ తెలిపారు.