పెళ్లి కోసం దాచిన నగదు అపహరణ
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:45 PM
పెళ్లి ఖర్చుల నిమిత్తం బీరువా లో దాచిన నగదు అప హరణకు గురైన ఘటన గురువారం చోటు చే సుకుంది.
పెబ్బేరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పెళ్లి ఖర్చుల నిమిత్తం బీరువా లో దాచిన నగదు అప హరణకు గురైన ఘటన గురువారం చోటు చే సుకుంది. ఎస్‌ఐ గంగిరె డ్డి యుగేందర్‌రె డ్డి తె లిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటీ లోని అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన సత్తె మ్మ తోటి కోడలు నాగ మ్మ కుమారుడి కార్తీక్ పెళ్లి ఖర్చుల కోసం 1వ తేదీన రూ.80వేల నగ దును ఇంట్లోని బీరువాలో భద్రపరిచింది. బుధవారం రోజు రాత్రి 7 గంటలకు చూడగా భద్రపరిచిన డబ్బులున్నాయి. ఆ రోజు రాత్రి తన ఇం టికి తాళం వేసి తోటి కోడలు ఇంట్లో నిద్రించింది. గురువారం ఉదయం తన ఇంటి తలుపులు, తాళం విరిగిపోయి ఉన్నాయి. అనుమానంతో వెం టనే ఇంట్లో ఉన్న బీరువాను పరిశీలించగా రూ.80వేల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు తెలిపారు. విషయం తెలుసుకు న్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితురా లు సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.