శ్రీరంగనాయక స్వామి ఆలయంలో చోరీ
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:24 PM
వనపర్తి జి ల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ ఆలయం లో పంచలోహ (రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి) వి గ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు.
- పంచలోహ విగ్రహాలు ఎత్తుకెల్లిన దుండగులు
- పరిశీలించిన వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి
శ్రీరంగాపురం,సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జి ల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ ఆలయం లో పంచలోహ (రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి) వి గ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఎస్పీ సునీ తారెడ్డి, వనపర్తి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సీఐ ఓడి రమే ష్‌తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారు జామున మూ డు పంచలోహ విగ్రహాలు, ఒక చిన్నపాటి వెండి కిరీటం గుర్తు తెలి యని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఎస్పీ తెలిపారు. ఆలయ ట్రస్టు అధి కారులు మదన్మోహన్, వినయ్‌లు ఫిర్యాదు చేశారని కొత్తకోట సీఐ ఓ డి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెబ్బేరు ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్, పెద్దమందడి ఎస్‌ఐ జలందర్ బృందం రెండు బృందాలుగా దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు. ఆలయ అర్చకు లు ఆలయ సిబ్బందిని విచారిస్తున్నామని ఆయన తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని దుండగులను తొందర్లలోనే పట్టుకొని జైలు పంపుతామని సీఐ రమేష్ తెలిపారు. శ్రీరంగాపూర్ ఎస్‌ఐ హిమబిం దు, ఏఎస్‌ఐ మన్యపురెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.