Share News

చినుకు చింత.. మీపైనే భారమంతా

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:47 PM

వానాకాలం మొదలైనప్పటికీ సరైన వర్షాలు లేక జిల్లాలో రైతాంగం నిత్యం ఆకాశంకేసి చూస్తున్నారు.

చినుకు చింత.. మీపైనే భారమంతా
రాజోలిలో పెద్దమ్మ తల్లికి పూజలు చేస్తున్న మహిళలు

మానవపాడు/ రాజోలి/అయిజ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వానాకాలం మొదలైనప్పటికీ సరైన వర్షాలు లేక జిల్లాలో రైతాంగం నిత్యం ఆకాశంకేసి చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మా రిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చినుకుజాడ లేకపోతే జీవ నం కష్టంగా మారుతుందని, పుష్కలంగా వర్షాలు కురపించాలని వేడుకుం టున్నారు. శుక్రవారం మానవపాడు మండలం అమరవాయి గ్రామ శివారు లోని పెద్దవాగులో గ్రామ మహిళలు గంగమ్మను తయారు చేసి, పూజలు చేశారు. అలాగే రాజోలిలో పెద్దమ్మతల్లికి గంగాభిషేకం, పంచామృతాభిషే కం నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలను (కుడుముల ను) ఆలయ ప్రాంగణంలో తయారు చేసి నైవేద్యం సమర్పించారు. ఆల యానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఇదే సమయంలో వర్షం కురవడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయిజలోని నూరీఖమర్‌, జూమియా, నడిమి, రహిమనియా, అబుబాక ర్‌, ఇలాహి, మదీనా మసీదులలో వర్షం కోసం ముస్లింలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated Date - Jul 17 , 2026 | 11:47 PM