భర్తను చంపిన భార్య
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:35 PM
క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ మహి ళ కట్టుకున్న భర్తనే కాటికి సాగనంపింది.
- క్షణికావేశంలో అఘాయిత్యం
గోపాల్‌పేట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ మహి ళ కట్టుకున్న భర్తనే కాటికి సాగనంపింది. వ నపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు, స్ధాని కులు తెలిపిన వివరాల ప్రకారం ఏదుట్ల గ్రా మానికి చెందిన శానాయిపల్లి బాలస్వామి, మల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు మల్ల య్య (36)కు శివమ్మతో వివాహమైంది. వా రికి ఒక కుమారుడు ఉన్నాడు. మల్లయ్య, శి వమ్మ గ్రామంలోనే మే కలు, గొర్రెలు పెంచు కుంటూ జీవనం కొన సాగిస్తున్నారు. రాత్రి వేళతో వారి సొంతిం టి దగ్గర జీవాలు నిలుపటానికి స్ధలం లేక పోవడంతో శివమ్మ తమ్ముడు పరమేష్ ఇం టి దగ్గర నిలుపుతున్నారు. పరమేష్ తన కు టుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా డు. ఇదిలా ఉండగా శివమ్మకు వివాహేతర సంబంధం ఉన్నదని భర్త రెండేళ్లుగా త రచూ గొడవపడుతున్నాడు. శుక్రవారం రాత్రి మల్లయ్య, శివమ్మ తమ ఇంటిలో భోజనం చేసుకొని జీవాల దగ్గరకు వెళ్లారు. వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో క్షణికావే శానికి గురైన శివమ్మ అక్కడే ఉన్న పారతో మల్లయ్య తలపై బలంగా కొట్టింది. దీంతో ఆ యన తల పగిలి అక్కడికక్కడే మృతి చెందా డు. తర్వాత శివమ్మ తన కుమారుడు రమే ష్‌కు పోన్‌చేసి మీ నాన్నను ఎవరో కొట్టిపో యారని చెప్పింది. వెంటనే రమేష్ అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు మృతిపై అను మానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం వారు సంఘటనా స్ధలా నికి చేరుకొని శివమ్మను అదుపులోకి తీసుకొ ని విచారించగా విషయం బయటపడినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. ఘటనా స్థ లాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, వనపర్తి సీఐ కృష్ణ పరిశీలించి బాధిత కుటుంబ సభ్యుల ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.