Share News

జలకళ తప్పింది

ABN , Publish Date - Apr 25 , 2026 | 10:44 PM

చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టు వాగు కళ తప్పింది. నాడు నీటితో సవ్వడి చేసిన వాగు నేడు చుక్క నీరు లేక ఒట్టిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ఎడారిని తలపిస్తోంది. వాగులో నీరు లేకపోవడంతో భూగర్భ జలం అడుగంటి, బోర్లు ఒట్టిపోతున్నాయి.

జలకళ తప్పింది
ఏదులాపూర్‌ శివారులో చుక్కనీరు లేక వెలవెలబోతున్న ఊకచెట్టువాగు

చుక్క నీరు లేని ఊక చెట్టువాగు

అడుగంటుతున్న భూగర్భజలాలు

దాహార్తితో అల్లాడుతున్న మూగజీవాలు

చిన్నచింతకుంట, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టు వాగు కళ తప్పింది. నాడు నీటితో సవ్వడి చేసిన వాగు నేడు చుక్క నీరు లేక ఒట్టిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ఎడారిని తలపిస్తోంది. వాగులో నీరు లేకపోవడంతో భూగర్భ జలం అడుగంటి, బోర్లు ఒట్టిపోతున్నాయి. మండలంలోని బండర్‌పల్లి నుంచి అల్లీపూర్‌ వరకూ దాదాపు 25 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న వాగు నుంచి దాదాపు 18 గ్రామాలకు సాగు నీరు అందుతోంది. మండలంలోని బండర్‌పల్లి, లాల్‌కోట, పల్లమర్రి, నెల్లికొండి, పెద్ద వడ్డెమాన్‌, చిన్న వడ్డెమాన్‌, ఏదులాపూర్‌, చిన్నచింతకుంట, మద్దూరు, అల్లీపూర్‌, కురుమూర్తి, అమ్మాపూర్‌, గూడూరు, కౌకుంట్ల మండలం లోని ముచ్చింతల, అప్పంపల్లి, దాసర్‌పల్లి, తిర్మాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో వాగులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లలో చుక్క నీరు కూడా నిల్వ లేదు. అయితే ఆయా గ్రామాల పరిధిలో వరి కోతలు కొనసాగుతుంటంతో నీటి అవసరం అంతగా లేదని రైతులు చెప్తున్నారు. కానీ మూగజీవాలకు తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 10:44 PM