ఓటు ఒక వజ్రాయుధం
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:14 PM
ఓటు హక్కు ద్వారా నిజాయతీ కలిగిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి వీలుంటుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతీ యువతీ యువకులు ఓటరుగా నమో దు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
- ఓటరు అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
నారాయణపేట, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి) : ఓటు హక్కు ద్వారా నిజాయతీ కలిగిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి వీలుంటుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతీ యువతీ యువకులు ఓటరుగా నమో దు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. 16వ జాతీయ ఓటరు దినో త్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్ట రేట్ వద్ద ఓటరు అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జాతీయ ఓట రు దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఓటర్లు, దివ్యాంగ, సీనియర్ సిటిజన్ ఓట ర్లను సన్మానించారు. అనంతరం కళా బృం దం పాడిన ఓటరు చైతన్య గీతాల మధ్య కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ శాసన్‌పల్లి రోడ్డు, ఆర్డీవో కార్యాల యం, పాత బస్టాండ్ మీదుగా సత్యనారా యణ చౌరస్తా వరకు చేరుకుంది. ఈ సం దర్భంగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న వి ద్యార్థిని విద్యార్థులు చౌరస్తాలో మానవహా రం ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అ దనపు కలెక్టర్ శ్రీను విద్యార్థులతో ఓటు హ క్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఎస్‌డీసీ రాజేందర్ గౌడ్, ఆర్డీవో రామచంద ర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివ శంకర్, డీపీఆర్‌వో రషీద్, ఎంఈవో బా లాజీ, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.