ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:00 AM
అర్హులైన వారికి రాజ్యాంగం కల్పించిన ఓటుహ క్కు దేశ భవిశత్తునే మార్చుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావళి ఆచారి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావళి ఆచారి
అయిజ టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారికి రాజ్యాంగం కల్పించిన ఓటుహ క్కు దేశ భవిశత్తునే మార్చుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావళి ఆచారి తెలిపారు. ఆదివారం సంపత్ కుమార్ ఆదేశాల మేరకు శేక్షావళిఆచారి ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, అలంపూర్ ఎస్ ఐఆర్ శ్రీకాంత్, నగర్‌కర్నూల్ ఎస్‌ఐఆర్ సిద్దేశ్వర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వార్డుల పరిశీలనలో ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఓట్లను తొలగించేందుకే బీజేపీ కుట్ర చేసుందన్నారు. దేశ భవిశత్తును మార్చే ఓటర్ జాబితా ప్రక్రియలో ఓటర్‌కు అన్యాయం జరగకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య, రా జ్యాంగ, ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. జాబితాలో తమపేరు ఉందో లేదో చూసుకుని అ భ్యంతరాలు ఉంటే దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప, విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటరీ సం కాపురం రాముడు, మండల అధ్యక్షుడు జయ్య న్న, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.