మూడవ రోజూ హోరాహోరీ
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:25 PM
ఎస్‌జీఎఫ్ 70వ రాష్ట్ర స్థాయి అండర్-17 క్రికెట్ పోటీలు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో హోరీహోరీగా సాగుతున్నాయి.
- కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
- సెమీస్‌కు చేరిన ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు
గద్వాల అర్బన్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌జీఎఫ్ 70వ రాష్ట్ర స్థాయి అండర్-17 క్రికెట్ పోటీలు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో హోరీహోరీగా సాగుతున్నాయి. పట్టణంలోని ఇన్‌డోర్ స్టేడియం, సోమనాద్రి ఫుట్‌బాల్ మినీ స్టేడి యంలలో బుధవారం మూడవ రోజు నిర్వహించిన పోటీలకు ఇన్‌చార్జి డీవైఎస్‌వో రామలింగేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం లో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు, టోర్నమెంట్ పరిశీలకులు డేవిడ్ సన్, బీసన్న, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సోమనాద్రి మినీ స్టేడియంలో...
మొదటి మ్యాచ్ వరంగల్ - ఖమ్మం జట్ల మధ్య జరిగింది. ఖమ్మం జట్టు నాలు గు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండవ మ్యాచ్ నల్గొండ - మెదక్ జట్ట మధ్య జరిగింది. నల్గొండ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 111 పరుగు లు చేయగా, 13 పరుగుల తేడాతో మెదక్ జట్టు గెలుపొందింది. మూడవ మ్యాచ్‌లో నిజామాబాద్ - అదిలాబాద్ జట్లు తల పడ్డాయి. అదిలాబాద్ జట్టు వికెట్ నష్టపో కుండా 97 పరుగులు చేసి గెలుపొందింది. వికాస్ 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి - హైద రాబాద్ జట్ల మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 12 ఓవర్లలో 139 పరుగులకు ఆల్ ఔట్ కాగా, రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఇండోర్ స్టేడియంలో మొదటి మ్యాచ్ మహబూబ్‌నగర్ - అదిలాబాద్ జట్ల మధ్య జరిగింది. మహబూబ్‌నగర్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అదిలాబాద్ జట్టు 78 పరుగులకు ఆల్‌ఔట్ కాగా, మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో కరీంనగర్ - హైదరాబాద్ జట్లు తలపడా ్డయి. కరీంనగర్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేయగా, 19 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. నల్గొండ - మహబూబ్‌నగర్ జట్ల మధ్య జరిగిన మూ డవ మ్యాచ్‌లో నల్గొండ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ జట్టు 80 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. నాల్గవ మ్యాచ్ మహబూబ్‌నగర్ - మెదక్ జట్ల మధ్య జరిగింది. పాలమూరు జట్టు ఆరు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మెదక్ జట్టు 78 పరుగులకు ఆల్‌ఔట్ కాగా, 18 ప రుగుల తేడాతో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించింది.
సెమీస్‌కు చేరిన జట్లు
మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన లీగ్ కమ్ నాకౌట్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికిట్ పోటీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. నాల్గవ రోజు గురువారం ఇండోర్ స్టేడియంలో మొదటి సెమీ ఫైనల్ ఉమ్మడి మహబూబ్‌నగర్ - రంగారెడ్డి జట్లు, సోమనాద్రి ఫుట్‌బాల్ మినీ స్టేడియంలో మెదక్ - ఖమ్మం జట్ల మధ్య రెండవ సెమీ ఫైనల్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ కన్వీనర్ బీసన్న తెలిపారు.