ఎండ ప్రచండం
ABN , Publish Date - Apr 25 , 2026 | 10:45 PM
ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎం డల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. శనివారం కూడా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గద్వాల జిల్లా గట్టులో గరిష్ఠంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత
గద్వాల క్రైం/నారాయణపేట/నాగర్‌కర్నూల్ టౌన్/వనపర్తి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎం డల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. శనివారం కూడా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైం ది. గద్వాల, అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడులో 42.6, మల్దకల్‌లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్ర త నమోదైంది. ఉప్పునుంతలలో 42.6, తిమ్మాజిపేటలో 42.4, వనపర్తి జిల్లా వీపనగండ్ల, శ్రీరంగాపూర్ మండలాల్లో 42.2, పాన్‌గల్, వనపర్తిల లో 42.1, నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఉష్ర్ణోగ్రత గరిష్ఠంగా 40 డిగ్రీలు నమోదైంది.