Share News

కొన.. సాగిన సమ్మె

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:24 PM

ఆ ర్టీసీ సమ్మె కొన.. సాగింది. రెండో రోజూ అద్దె బస్సులు తప్ప అన్నీ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి.

 కొన.. సాగిన సమ్మె
మహబూబ్‌నగర్‌ డిపో ముందు బస్సులను ఆపుతున్న కార్మికులు

- అద్దె బస్సులు తప్ప.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

- ప్రభుత్వం దిగిరావాలి

- ఆర్టీసీ జేఏసీ నాయకులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఏఫ్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఆ ర్టీసీ సమ్మె కొన.. సాగింది. రెండో రోజూ అద్దె బస్సులు తప్ప అన్నీ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. దీంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యో గులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గురువారం పాఠ శాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సొంతూర్ల కు వెళ్లేందుకు విద్యార్థులు, వారిని తీసుకెళ్లేందుకు వ చ్చిన తల్లిదండ్రులు, బంధువులు నానా తంటాలు ప డ్డారు. కాగా, ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె చే స్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు వీరాంజనేయులు, జీఎల్‌.గౌడ్‌, సాయిరెడ్డి, విజయబాబు, బసప్ప నాగేంద ర్‌ పేర్కొన్నారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో డిపో ముం దు ధర్నా నిర్వహించారు. వివిధ ట్రేడ్‌ యూనియన్లకు చెందిన నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొని మ ద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఆకలి మంటలతో సమ్మె చేస్తున్నామని, దీని వెను క ప్రభుత్వం అనుకుంటున్నట్లు ఎవరూ లేరని పేర్కొ న్నారు. ప్రభుత్వం 29 డిమాండ్లు అంగీకరించిందని మంత్రి పేర్కొంటున్నారని, చర్చలలో ఈ ప్రస్తావన లే దన్నారు. యూనియన్లు లేకుంటే నాయకులను చర్చ లకు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఆంధ్రలో ఒక ఉద్యోగి రూ.60 వేల నుంచి 70 వేలు పొందుతుంటే ఇ క్కడ రూ.40 వేలు కూడా వేతనం లేదని ముఖ్యమం త్రి గురువైన చంద్రబాబుతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతీ ఆర్టీసీ ఉద్యోగి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమ్మె చేయని వారి ఫోటోలు ప్లెక్సీలో పెట్టిస్తామని హెచ్చరించారు.

కార్మికులను నష్టపరచాలని ప్రతిపక్షాల కుట్ర

ఆర్టీసీ కార్మికులను నష్టపర్చాలని ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని డీ సీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మి థున్‌రెడ్డి ఆరోపించారు. గు రువారం స్థానిక ఆర్టీసీ కార్మి కుల నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ కోసం కొందరు చేసే సమ్మెకు కార్మికులు సహకరించవద్దని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ సంఘం అధ్య క్షుడు గోనెల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ ఉమర్‌ కొత్వాల్‌, నా యకులు చందుయాదవ్‌ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో రోడ్డెక్కిన 426 బస్సులు

పాలమూరు ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల పరిధిలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రెండవ రోజు గురువారం 426

Updated Date - Apr 23 , 2026 | 11:24 PM