చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:09 PM
గద్వాల పట్టణ పరిధిలోని మొత్తం 37 మంది కౌన్సి లర్లలో నిర్దేశించిన రిజర్వేషన్ ఆధారంగా జ నరల్ మహిళను గద్వాల మునిసిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌ను ఈనెల 16న సోమవా రం ఎన్నుకోవాల్సి ఉంది.
- మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు
- పట్టణ ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠ
గద్వాలటౌన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన చైర్మ న్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. పట్టణ పరిధిలోని మొత్తం 37 మంది కౌన్సి లర్లలో నిర్దేశించిన రిజర్వేషన్ ఆధారంగా జ నరల్ మహిళను గద్వాల మునిసిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌ను ఈనెల 16న సోమవా రం ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం పట్ట ణ మునిసిపల్ కార్యాలయంలో ఆదివారం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 37మంది కొ త్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కౌన్సిల్ ఎక్స్ అఫీషి యో సభ్యులుగా నాగర్‌కర్నూల్ ఎంపీ, గద్వా ల ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొననున్న నేప థ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశా రు. ఎన్నికల అనంతరం కౌన్సిల్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో గ ద్వాల పుర చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈనెల 13వ తేదీ శుక్రవారం కౌంటింగ్ ముగిసిన వెంటనే ఎన్నికైన 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ఇద్దరు స్వతంత్రులు, ఏఐఎంఐఎం చెందిన ఒక కౌ న్సిలర్‌తో కలిసి మొత్తం 19మంది ఒక శిబి రంగా హైదరాబాద్‌కు వెళ్లిపోవడం గమనా ర్హం. వారితో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన 11 మంది కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన ఏడుగురి తో కలిసి ఒకే శిబిరంలో హైదరాబాద్‌లో ఉం టున్నట్లు సోషల్ మీడియా ఫొటోలు వా ర్తలు వస్తుండటంతో గద్వాల మునిసిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికవుతార న్నది పట్టణ ప్రజలకు ఉత్కంఠగా మారింది. కౌంటింగ్ ముగిసిన నాటి నుంచి వివిధ రకా లు ఊహాగానాలు, లెక్కలు, పార్టీల విప్ జా రీ, దానిపై లీగల్‌గా తలెత్తే వివరాలు, పరి ణామాలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండటం పట్టణ ప్రజలకు ఇదో పెద్ద మిస్టరీ వ్యవహారంగా మారిపో యింది. మరో 24 గంటలు గడిస్తే కానీ ఈ ఉత్కంఠకు తెర దిగే అవకాశం లేదు.