జూరాల ధగధగ
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:37 PM
జూరాల ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది. రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో ధగధగ మెరుస్తోంది.
అమరచింత, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జూరాల ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది. రాత్రి వేళ విద్యుత్ వెలుగుల్లో ధగధగ మెరుస్తోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో అధికారులు 27 గేట్లను ఎత్తి 1,77,105 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లైట్ల వెలుతురులో నీటి ప్రవాహం వెండి మబ్బులను తలపిస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు, యువకులు తరలి వస్తున్నారు.