Share News

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:38 PM

ఎస్‌ఐఆర్‌-2026 కార్యక్రమంలో భాగంగా నోటీసుల పంపిణీ, విచారణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌, జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారి జేఎల్‌బీ హరిప్రియ ఆదేశించారు.

 గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి
ఎస్‌ఐఆర్‌పై సమీక్ష నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్‌ హరిప్రియ

జడ్చర్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్‌-2026 కార్యక్రమంలో భాగంగా నోటీసుల పంపిణీ, విచారణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌, జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారి జేఎల్‌బీ హరిప్రియ ఆదేశించారు. జడ్చర్ల మునిసిప కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అసెంబ్లీలోని ఎన్నికల అధికారులతో సమీక్షించారు. బాలానగర్‌, రాజాపూర్‌ మండలాల్లో నోటీసుల పంపిణీతో పాటు విచారణ వందశాతం పూర్తైందన్నారు. మిగిలిన మండలాల్లో పెండింగ్‌లో ఉన్న నోటీసుల పంపిణీ, విచారణల వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే ఈఆర్వోల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తుల స్థితిగతులను, పరిష్కార పురోగతిని సమీక్షించారు. కాగా ఇప్పటి వరకు 45శాతం దరఖాస్తులు పూర్తయ్యాయని ఏఈఆర్వోలు తెలిపారు. ఎన్నికల సంఘం నోటీసుల జారీ, విచారణలకు ఈనెల 26 వరకు పొడగించారని, 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, మునిసిపల్‌ కమిషనర్‌ గిరీష్‌, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, బాలానగర్‌, రాజాపూర్‌, మిడ్జిల్‌, ఊర్కొండ, నవాబ్‌పేట తహసీల్దార్లు, ఎన్నికల విభాగం డీటీ మహబూబ్‌అలీ, జడ్చర్ల డీటీ అజయ్‌కుమార్‌, రాజకీయ నాయకులు ఎంబీ శ్రీకాంత్‌, తెలుగుసత్తయ్య, మినాజ్‌, అమర్‌నాథ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 10:38 PM