Share News

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:30 PM

ఎస్‌ఐఆర్‌-2026 కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జడ్చర్ల అసెంబ్లీ ఈఆర్వో, అద నపు కలెక్టర్‌ హరిప్రియ ఆదేశించారు.

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి
సమీక్ష నిర్వహిస్తున్న జడ్చర్ల అసెంబ్లీ ఈఆర్వో, అదనపు కలెక్టర్‌ హరిప్రియ

జడ్చర్ల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్‌-2026 కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జడ్చర్ల అసెంబ్లీ ఈఆర్వో, అద నపు కలెక్టర్‌ హరిప్రియ ఆదేశించారు. జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం రాజకీ య పార్టీల నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవ ర్గంలో ఇప్పటి వరకు 93.59 శాతం నోటీసులు పంపిణీ చేయగా, 45.33 శాతం విచారణ పూ ర్తైనట్లు వివరించారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం పంపిణీ చేయగా, మిగిలిన నోటీసుల విచారణ ను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ఏఈఆ ర్వో లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న నూతన ఓటరు నమోదు ఫారం-6, ఓటరు తొలగింపునకు ఫా రం-7, ఓటరు వివరాల సవరణకు ఫారం-8లతో దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏమై న అభ్యంతరాలు, సమస్యలుంటే అధికారుల దృ ష్టికి తీసుకురావాలన్నారు. జడ్చర్ల అసెంబ్లీ ఏఈ ఆర్వో, తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, అదనపు తహ సీల్దార్‌ అజయ్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ గిరీష్‌, ఎన్నికల డీటీ మహబూబ్‌అలీ, డీటీ కిశో ర్‌, నాయకులు శ్రీకాంత్‌, ఇంతియాజ్‌ఖాన్‌, అమ ర్‌నాథ్‌గౌడ్‌, సత్తయ్య, మినాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 11:31 PM