రోడ్డుకు మరమ్మతు చేయించిన ఎస్‌ఐ
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:10 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో నుంచి జాతీయ రహదా రి 44 పొగాకు కంపెనీకి వెళ్లే దారి గుండ గుంత లు అధికంగా ఉండటంతో ఎస్‌ఐ రవి గుంతలను కాంక్రీట్‌తో పూడ్చివేయించారు.
ఇటిక్యాల జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో నుంచి జాతీయ రహదా రి 44 పొగాకు కంపెనీకి వెళ్లే దారి గుండ గుంత లు అధికంగా ఉండటంతో వాహనాదారులు ఇ బ్బందులు పడుతున్నరని సోమవారం ఎస్‌ఐ రవి గుంతలను కాంక్రీట్‌తో పూడ్చివేయించారు. ముఖ్యంగా గ్రామ సమీపంలో మోకాలిలోతు గుంతలు ఉన్నాయి. వాటిని పూడ్చేందుకు ఒకేచో ట టిప్పర్ కాంక్రీట్ వేయించి జేసీబీతో చదును చేయించారు. రోడ్డు పనులు చేయిస్తున్న ఎస్‌ఐని చూసి గ్రామస్థులు, వాహనాదారులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఏ ఎస్‌ఐ సుధాకర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.