పాలమూరుపై కరువుకాటు
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:40 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంటలు వా నాకాలం సీజన్లో కరువు కాటుకు గురయ్యా యి. సీజన్ ఆరంభంలో వర్షాలు కురవకపోవ డం, ఎల్‌నినో భయంతో సాగు విస్తీర్ణం గణనీ యంగా తగ్గగా సాగు చేసిన తర్వాత కొన్ని పం టలు ఎండిపోయాయి.
- ఉమ్మడి పాలమూరులోని 78 మండలాలకు 60 మండలాల్లో కరువు
- వాటన్నింటినీ కరువు మండలాలుగా గుర్తించాలని ప్రతిపాదనలు
- వర్షపాతం, పంటనష్టం, భూగర్భ జలాలు, తేమ శాతమే ఆధారం
-సుమారు 40 శాతం దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పత్తి పంటలు
- నష్టపరిహారం అందజేయాలంటున్న రైతులు, ప్రతిపక్షాలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంటలు వా నాకాలం సీజన్లో కరువు కాటుకు గురయ్యా యి. సీజన్ ఆరంభంలో వర్షాలు కురవకపోవ డం, ఎల్‌నినో భయంతో సాగు విస్తీర్ణం గణనీ యంగా తగ్గగా సాగు చేసిన తర్వాత కొన్ని పం టలు ఎండిపోయాయి. ఇప్పుడు చేతికి వస్తున్న దశలో మరింత పంట ఎండవేడి.. నీటి కొరత, భూగర్భ జలాలు తగ్గడం, కరెంటు కోతలతో ఎం డిపోతోంది. ఏమీ చేయలేని రైతు నిస్సహాయ స్థి తిలో ఉండగా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కావాలని కోరుతున్నాడు. రాష్ట్రంలో 2023లో కూ డా కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ అప్పుడు ఆరుతడి పంటలకు అనుకూలంగా వర్షాలు కురి శాయి. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నంగా ఒ క్క జూలై చివరిలో, ఆగస్టు మొదటి వారంలో మినహా పెద్దగా వర్షపాతమే నమోదు కాలేదు. ఇప్పుడు ఎండిపోయిన పంటల జాబితాలో వరి తో పాటు ఆరుతడి పంటల శాతం కూడా అధి కంగా ఉన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ తేడాది 9.54 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా ఈ ఏడాది 6.56 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. అంటే గతేడాది కంటే దాదాపు 2.98 లక్షల ఎక రాల సాగు తగ్గింది. అయితే సాగు చేసిన వరి లో కూడా దాదాపు 30 శాతం మేర ఎండుము ఖం పట్టిందని, అడపాదడపా తడులు ఇచ్చినా దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. దాదాపు మొత్తం సాగులో 1.90 లక్షల ఎకరాలపై ఈ ప్రభావం ఉంటుందని అం చనా వేస్తున్నారు. సాఽధారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తుంది. ఇ ప్పుడు 18 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న గ తేడాది 1.39 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ ఏడాది దాదాపు 50 శాతం తగ్గిపోయి 65,865 ఎకరాల్లో సాగుచేశారు. అందులోనూ 30 శాతం మేర పం ట ఎండిపోయిందని అంచనా వేస్తున్నారు. అ చ్చంపేట, లింగాల, పదర, బల్మూరు, అ మ్రాబాద్, వంగూరు, ఉర్కొండ, వెల్దండ, కల్వకుర్తి, పెద్దకొత్తపల్లి, కోడేరు వంటి మండలాల్లో అయితే మొక్కజొన్న 50 శా తం మేర ఎండిపోయింది. వరి తర్వాత ప్రధాన పంట అయిన పత్తి గతేడాది 8,13,392 ఎకరాల్లో సాగు కాగా దాదాపు 45 శాతం విస్తీర్ణం తగ్గి 4,54,874 ఎకరా ల్లోనే సాగైంది. జూన్, జూలైలో వర్షం కురవకపోవడంతో చా లామంది మొక్కల దశలోనే చేలను దున్ని వేశారు. కొంతమంది ఆశతో చూసినా సె ప్టెంబరులో ఉమ్మడి జిల్లాలో 80 శాతం లోటు వర్షం నమోదు కావడంతో ఒక్కసా రి పత్తి తీసి చెలకలను వదిలేశారు. జొన్న, వేరుశనగ, మిరప, పొగాకు పంటల సాగు తగ్గిపోయింది. ఓ వైపు వానాకాలంలో పం టనష్టం, పెట్టుబడి నష్టం వాటిల్లగా యా సంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాల ని ప్రభుత్వం చెబుతోంది. వాటికీ తడి లేక పలుచోట్ల మొలకలు కూడా బయటకు రా వడం లేదు.
77 శాతం కరువు ప్రాంతమే
ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడి వర్షపాతం త క్కువగా నమోదు కావడంతో పాటు పంటనష్టం జరగడంతో ప్రభుత్వం ఉపశమన చర్యలను ప్రా రంభించింది. నిర్దిష్ట అంశాల ప్రాతిపదికన కరు వు మండలాల జాబితా తయారుచేసి పంపించా లని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆ యా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికా రులు, ముఖ్య ప్రణాళిక శాఖ, రెవెన్యూ అధికారు లతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందు లో వర్షపాతం నమోదు, పంటలు వేయడం, వే సిన పంటలు ఏ దశలో ఎండిపోయాయి, భూగ ర్భజలాల శాతం ఎంత ఉన్నది, గతేడాది ఎంత ఈ ఏడాది తేడా ఎంత ఉన్నది. నేలలోని తేమ శాతం ఏ విధంగా ఉన్నది, యాసంగి పంటలకు నేలలు అనుకూలమా, కాదా అని గుర్తించి నివే దికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పం పించగా ఈ అంశాల ప్రాతిపదికన పూర్తిస్థాయి రిపోర్టును అందజేయాల్సి ఉంది. ఉమ్మడి పాల మూరు జిల్లాలో 78 మండలాలు ఉండగా అం దులో 60 మండలాలను ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో కరువు మండలాలుగా గుర్తించి ప్ర భుత్వానికి నివేదించారు. ఉమ్మడి పాలమూరు లోని వ్యవసాయానికి యోగ్యమైన 77 శాతం నే లలు కరువుకాటుకు గురయ్యాయని నిర్ధారించా రు. వర్షపాతం ఎక్కువగా నమోదై, ప్రాజెక్టుల నుంచి కొద్దోగొప్పో నీరు అందడం, భూగర్భ జ లాలు చాలా తక్కువ లోతులో లభ్యం అయ్యా యనే కారణంతో కొన్ని మండలాలను ఇందులో చేర్చలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో మహ్మదా బాద్, నవాబుపేట, మిడ్జిల్, భూత్పూరు మండ లాలు, వనపర్తి జిల్లాలో రేవల్లి, శ్రీరంగాపూర్, మదనాపూర్, చిన్నంబావి మండలాల్లో అనుకూ లమైన వర్షపాతం నమోదు కావడంతో జాబితా లో చేర్చలేదు. గద్వాల జిల్లాలో మొత్తం మండ లాలను జాబితాలో చేర్చగా నారాయణపేట జి ల్లాలో 11 మండలాలను పంపించగా ఉట్కూరు, మాగనూరు, కృష్ణా మండలాలను జాబితాలో చే ర్చలేదు. నాగర్‌కర్నూలు జిల్లాలో 13 మండలాల ను జాబితాలో చేర్చగా ఏడు మండలాలను చే ర్చలేదు. కొల్లాపూర్, పెంట్లవల్లి, తాడూరు, తెల్క పల్లి, తిమ్మాజిపేట, నాగర్‌కర్నూలు, ఉప్పునుంత ల మండలాల్లో కొంత అనుకూల పరిస్థితులు ఉ న్నాయని నిర్ధారించారు. అయితే కరువు మండ లాలుగా ప్రకటించని వాటిలో కూడా రైతులు నష్టపోతే పరిహారం ఇచ్చే క్రమంలో పరిగణన లోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
గద్వాలలో 23 వానరోజులే...
ఉమ్మడి పాలమూరు జిల్లా కరువుకు కేరా ఫ్ అడ్రస్. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న కారణంగా మిగతా జిల్లాలతో పోల్చితే ప్రతీ ఏటా కొంత వర్షపాతం తక్కువే. అయినప్ప టికీ ఈ ఏడాది వర్షపాతం లెక్కలు ఆందోళ న కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షపాతం న మోదు, వర్షం కురిసిన రోజులు, అత్యల్ప వ ర్షపాతం కేటగిరీల్లో చివరి స్థానాల్లో ఉన్నా యి. మేడ్చల్- మల్కాజిగిరి, హనుమకొండ, నల్గొండ జిల్లాలు మినహా చివరిలో ఉన్న మిగతా జిల్లాలు మొత్తం ఉమ్మడి జిల్లావే. అందులో జోగుళాంబ గద్వాలలో రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాల్లో చివ రిస్థానంలో నిలిచింది. సాధారణంగా వానా కాలం సీజన్ జూన్ 1 నుంచి ప్రారంభమై న వంబరు మొదటివారం వరకు కొనసాగు తుంది. ప్రధానంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షాలు ఎక్కు వగా పడతారు. నాలుగు నెలలు వేసుకున్నా 120 రోజులు వర్షాలు పడాలి. అన్ని రోజులు వర్షం కురవదు కాబట్టి 90 రోజులు సగటు న వేసుకున్నా ఈ సారి గణనీయంగా వర్షం రోజులు తగ్గాయని చెప్పవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 42 రోజులు న మోదు కాగా అత్యల్పంగా జోగుళాంబ గద్వా ల జిల్లాలో 23 రోజులే నమోదయ్యాయి. వ నపర్తి, నారాయణపేట జిల్లాల్లో 33 రోజులు వర్షాలు కురువగా నాగర్‌కర్నూలు జిల్లాలో 32 రోజులు మాత్రమే వర్షపాతం నమోదైం ది. వర్షపాతం అతి తక్కువగా నమోదు కా గా మహబూబ్‌నగర్ 26వ స్థానంలో, వనప ర్తి 27వ స్థానంలో, నాగర్‌కర్నూలు 28వ స్థా నంలో న్నాయి. నారాయణపేట 32వ స్థానం లో, జోగుళాంబ గద్వాల జిల్లా చివరి స్థానం లో ఉన్నాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉ న్నందున నష్టపరిహారాన్ని రైతులు కోరుతు న్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా కరువు ప్రాంతాలను పరిశీలించడం, సాగునీటి కో సం నిరసనలు తెలపడం, కరెంటు కోతలపై ధర్నాలు నిర్వహించడంలో వేగం పెంచాయి.