ప్రయాణికుల క్షేమమే మన లక్ష్యం కావాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:47 PM
ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా విధి నిర్వహణలో ఉండే డ్రైవర్లు అ త్యంత జాగ్రత్త, నిబద్ధతతో సేవలందించాలని గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత సూచిం చారు.
ఆర్టీసీ డ్రైవర్లతో డిపో మేనేజర్ సునీత
గద్వాల అర్బన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా విధి నిర్వహణలో ఉండే డ్రైవర్లు అ త్యంత జాగ్రత్త, నిబద్ధతతో సేవలందించాలని గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత సూచిం చారు. జాతీయ డ్రైవర్స్‌ను పురస్కరించుకుని శనివారం డిపో వద్ద డ్రైవర్లకు డీఎం గులాబీ పూలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిపో నుంచి డ్రైవర్లతో కలిసి స్థానిక కృష్ణవేణి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక ఆటోడైవర్లు, క్యాబ్ డ్రైవ ర్లు, వాహనాల డ్రైవర్లకు పుష్పాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రోడ్డు భద్రతను విధి గా పాటించాలని సూచించారు. అదే సమయం లో వాహనం నడిపే డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు భద్రత ఉండే లా డ్రైవింగ్‌లో ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నా రు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌తో పాటు ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కార్మికులు ఉన్నారు.