ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:45 PM
తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన పాలమూరు యూనివర్సిటీ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
- ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి
- ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి : ఎమ్మెల్సీ కోదండరామ్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబరు 24 (ఆంఽధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన పాలమూరు యూనివర్సిటీ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలమూరు ప్రాంతానికి చెందిన అనేక మంది ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాలమూరు ప్రాంతం అభివృద్ధి చెందితేనే ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు. సాగునీరు, ఉపాధి, విద్య, వైద్యం, క్రీడలు తదితర రంగాల్లో ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం దక్కేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు ప్రజలు, ఇక్కడి ఉద్యమకారులు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. అనంతరం పీయూ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య పీ రమేశ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ రాములు, టీపీసీసీ అఽధికార ప్రతినిధి ఏపీ మిఽథున్‌రెడ్డి, పిడమర్తి రవి, సతీశ్, చంద్రనాయక్ మాట్లాడారు.