ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:50 PM
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటుహక్కును ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రమా ఓబులేష్ అన్నారు.
గద్వాల, శాంతినగర్‌లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ర్యాలీ
వడ్డేపల్లి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటుహక్కును ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రమా ఓబులేష్ అన్నారు. జాతీయ ఓటర్ల దినత్సోవం సందర్భంగా శనివారం శాంతినగర్‌లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యా లీ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ అ ధ్యక్షతన, రాజనీతిశాస్త్రం డిపార్ట్‌మెంట్, ఎన్‌ఎస్ ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో కళశాల విద్యార్థు ల చేత ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్‌కుమార్, డా క్టర్ ఏడుకొండలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాఘవేందర్, జీవ జయరాజ్, చంద్రశేఖర్, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు ఉన్నారు.
గద్వాల డిగ్రీ కళాశాలలో..
గద్వాల టౌన్: 18ఏళ్లు నిండిన వయోజను లంతా ఓటుహక్కును పొందేలా విద్యావంతులై న యువతీ, యువకులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర మోహన్ సూచించారు. జాతీయ ఓటరు దినోత్స వాన్ని పురస్కరించుకుని మందస్తుగా శనివారం పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటుహ క్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడిన ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, గ్రామాల్లోని బీఎల్‌వోల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేలా చూడాలన్నారు. విద్యార్థు లు, అధ్యాప కుల చేత ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఓట రు ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల రా జనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ని ర్వహించిన కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ పవన్‌కుమార్, రాజనీతిశాస్త్ర విభాగం హెచ్‌ఓడీ శ్రీనివాస్, అధ్యాప కులు సత్యన్న, హరినాగభూషణం, క రుణాకర్, వెంకటేశ్వరమ్మ, వెంకటేశం, తిరుపతయ్య, హరిబాబు, సాయికృ ష్ణ, ధర్మతేజ, రమేశ్ ఉన్నారు.