Share News

భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే రీ సర్వే

ABN , Publish Date - Sep 30 , 2026 | 10:57 PM

భూస మస్యలకు శాశ్వత పరిష్కా రమే రీ సర్వే అని కలెక్టర్‌ ప్రియాంక అన్నారు.

భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే రీ సర్వే
మాగనూరు మండలం గజరందొడ్డిలో నిర్వహించిన భూభారతి-భూసర్వే కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ ధనవంత్రి, హాజరైన కలెక్టర్‌ ప్రియాంక

- సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి సహకరించాలి

- కలెక్టర్‌ ప్రియాంక

మాగనూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): భూస మస్యలకు శాశ్వత పరిష్కా రమే రీ సర్వే అని కలెక్టర్‌ ప్రియాంక అన్నారు. మాగ నూరు మండలంలోని గజ రందొడ్డి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూభారతి - భూ సర్వే గ్రామ సభకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దాదాపు వందేళ్ల తర్వాత ప్ర భుత్వం భూముల రీసర్వే చేపడుతోందని ప్రతీ భూమికి భూధార్‌ నెంబర్‌ కేటాయించి, ఎల్పీఎం ద్వారా వివరాలను ఆన్‌లై న్‌లో నమోదు చేసి, రైతులకు పాసుపుస్తకాలు అందిస్తామన్నారు. రీ సర్వే ద్వారా ఎవరి భూమి ని తగ్గడం కానీ, పెరగడం కానీ జరగదన్నారు. సర్వేయర్లు గ్రామానికి వచ్చినప్పుడు రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. స ర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజే యాలని అధికారులకు సూచించారు. రైతులకు సమస్యలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృ ష్టికి తీసుకురావాలని, త్వరలో ఏర్పాటు చేయ నున్న టోల్‌ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయవ చ్చన్నారు. సర్పంచు ఎం.రాములు, తహసీల్దార్‌ అబ్దుల్‌ రెహమాన్‌, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

భూసర్వే నిర్వహించుకోవాలి

కృష్ణ/మక్తల్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): భూము లు రీసర్వే చేయడం వల్ల రైతులకు ఇబ్బందులు తొలగి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అదనపు కలెక్టర్‌ శ్రీను అన్నారు. బుధవారం కృ ష్ణ మండలం ముడుమాల్‌దొడ్డి గ్రామంలో నిర్వ హించిన గ్రామసభకు అదనపు కలెక్టర్‌ హాజరై, మాట్లాడారు. భూమి రీసర్వే చేయించడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. తహసీల్దార్‌ శ్రీని వాస్‌, ఆర్‌ఐ శ్రీశైలం, జీపీవో సునీత, సర్పంచ్‌లు బాలరాజీ, నర్సమ్మ, సర్వే యర్లు పాల్గొన్నారు.

అదేవిధంగా, మక్తల్‌ మండలం ముసలాయి పల్లి గ్రామంలో భూముల రీసర్వే పనులను అద నపు కలెక్టర్‌ పర్యవేక్షించారు. సర్వేయర్లతో మా ట్లాడి రీసర్వే సకాలంలో పూర్తి చేయాలని సూ చించారు. తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, సర్వేయ ర్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పుస్తకమే విద్యార్థులకు ఆయుధం

మక్తల్‌ (ఆంధ్రజ్యోతి): పుస్తకమే విద్యార్థులకు ఆయుధం అని, ప్రతీ విద్యార్థిని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక అన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణం లోని ఊట్కూర్‌ బాలికల గురుకుల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాలలో డార్మెట్రీ, మ రుగుదొడ్లు, తరగతి గదులు, స్టోర్‌రూంతో పాటు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేసి వారి నైపుణ్యాన్ని తెలుసు కున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ రాజయ్య, అ ధ్యాపకులు ఉన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 10:57 PM