ఖాళీ అవుతోన్న జలాశయం..!
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:30 PM
శ్రీశైలం జలాశంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుము ఖం పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరి ధిలో ఉన్న కుడి, ఎడమ గట్టు భూగర్భ జలవి ద్యుత్ కేంద్రాలలో ముమ్మరంగా విద్యుదుత్పాదన తో పాటు సాగు, తాగు నీటి అవసరాలకు నీటి వినియోగం కొనసాగుతున్నది.
- ముమ్మరంగా శ్రీశైలం కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన
- మిగిలింది 70 టీఎంసీలే
- రెండు వారాల్లో 30 టీఎంసీల నీటి వాడకం
- మరో మూడు నెలలు సరిపడేనా..?
బ్రహ్మగిరి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుము ఖం పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరి ధిలో ఉన్న కుడి, ఎడమ గట్టు భూగర్భ జలవి ద్యుత్ కేంద్రాలలో ముమ్మరంగా విద్యుదుత్పాదన తో పాటు సాగు, తాగు నీటి అవసరాలకు నీటి వినియోగం కొనసాగుతున్నది. రోజుకు మూడు టీఎంసీల నీటి వినియోగం జరుగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో రెండు వారాల వ్యవధిలో 30 టీఎంసీలకుపైగా నీటిని ఇరు రాష్ట్రాలు ఇప్ప టికే వాడేశారు. విద్యుత్ ఉత్పత్తిలో రెండు విద్యు త్ కేంద్రాల్లో పోటీపడి ఉత్పత్తిని కొనసాగిస్తు న్నారు. ఇలాగే కొనసాగితే మరో రెండు వారాల్లో డ్యాంలో నీటి నిల్వలు 40 టీంసీలకు చేరుకునే అవకాశం ఉందని దీంతో డెడ్‌స్టోరేజికీ పడిపోవ డం, మరో మూడు నెలలు తీవ్ర నీటి ఎద్దడి తప్పదని కొందరు నీటిపారుదలశాఖ అధికారు లు అభిప్రాయపడుతున్నారు.డ్యాంలోకి జూన్ త ర్వాతనే వరద నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతే కాకుండా రెండు రాష్ట్రాల సరిహద్ధులో వి స్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో కృషా ్ణనదిలో జలాలు అడుగంటుతుండటంతో జంతు వులకు సైతం నీటి ఎద్దడి ఏర్పడుతుందని అట వీశాఖ అధికారులు అంటున్నారు. శనివారం శ్రీశై లం డ్యాం నీటి నిల్వలు ఈ విధంగా నమోదు అయ్యాయి. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215.8070 టీఎంసీల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 845.10 అడుగులకు చేరగా 70.2053 టీఎంసీల నీటి నిల్వలు మాత్ర మే ఉన్నట్లు డ్యాం గేజింగ్ అధికారులు పేర్కొం టున్నారు. గడిచిన 24 గంటల్లో కుడిగట్టు 26,842 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం 35,315 క్యూ సెక్కుల నీటిని విద్యుత్ ఉ త్పాదనకు మొత్తంగా సాగర్‌కు 62, 157 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తూ వినియోగించినట్లు డ్యాం అధికారులు తెలిపారు.